Trending
Saturday, 30 May 2015

‘బి.ఎ.పాస్‌’ సెన్సార్‌ పూర్తి!! తెలుగులో.

ba Pass Movie Tollywood Censored

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులు`రివార్డులు అందుకొన్న చిత్రం ‘బి.ఎ.పాస్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా, ‘మినిమం గ్యారెంటీ మూవీస్‌’ (ఎం.జి.ఎం) ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూర్చడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు మాట్లాడుతూ... ‘ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత భరత్‌ షా, చిత్ర దర్శకుడు అజయ్‌ బాల్‌ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం తెలుగు సెన్సార్‌ పూర్తయ్యింది. డబ్బింగ్‌ చిత్రం అనే విషయం ఎక్కడా గుర్తుకు రాకుండా.. చాలా సహజసిద్ధంగా తెలుగు సంభాషణలు అందించిన వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రాన్ని హిందీలో వలె తెలుగులోనూ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
శిల్పా శుక్ల, షాదబ్‌ కమల్‌, రాజేష్‌ శర్మ, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్‌, దర్శకత్వం: అజయ్‌ బాల్‌, నిర్మాత: ఎం.అచ్చిబాబు!!

No comments:

Item Reviewed: ‘బి.ఎ.పాస్‌’ సెన్సార్‌ పూర్తి!! తెలుగులో. Rating: 5 Reviewed By: TeluguPeople Adda